బాసర, సెప్టెంబర్ 8 : గ్రామీణ, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు సాంకేతిక విద్యను అందించాలనే ఉద్దేశంతో నిర్మల్ జిల్లాలోని బాసరలో నెలకొల్పిన ఆర్జీయూకేటీలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. హాస్టల్ భవనాల్లో వసతులు లేక, భోజనం లేక పోవడంతోపాటు విద్యార్థులు సతమతం అవుతున్నారు. గతంలో సమ్మె చేసిన సమయంలో సంఘీభావం తెలిపేందుకు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థులను కలవడానికి వస్తుండడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులను తప్పించుకుని గోడదూకి ట్రిపుల్ ఐటీలోకి ప్రవేశించాడు.
అయితే ఇప్పుడు రేవంత్‌రెడ్డి సీఎం అయిన కూడా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ట్రిపుల్ ఐటీపై పట్టింపు ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా జాతీయ విద్యార్థి సంఘం(ఎన్ఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ట్రిపుల్ ఐటీకి వచ్చారు. కానీ.. ఇప్పుడు విద్యార్థుల సమస్యలపై పట్టింపు లేకుండా మౌనంగా ఉండడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనకు సిద్ధమవుతున్న విద్యార్థులు
ట్రిపుల్ ఐటీలో సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సరైన హాస్టల్ గదులు, బాత్రూంలు లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ట్రిపుల్ ఐటీకి ఇన్చార్జి వీసీగా ఉన్న వెంకటరమణ స్థానికంగా ఇక్కడ ఉండకపోవడంతో సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం మూలంగా విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్న విద్యార్థులు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.
సుమారు 2 వేల మంది విద్యార్థులు ఐదు రోజులుగా ట్రిపుల్ ఐటీలో ర్యాలీ నిర్వహించి అడ్మినిస్ట్రేషన్‌కు వ్యతిరేరంగా నినాదాలు చేస్తున్నారు. వెంటనే వీసీ రాజీనామా చేయాలని, ఒక రెగ్యూలర్ వైస్ చాన్స్‌లర్‌ను వెంటనే నియమించాలని కోరుతూ విద్యార్థులు నినాదాలు చేశారు. అదేవిధంగా తమ సమస్యలను పరిష్కరించాలని 17 డిమాండ్లను అధికారుల ముందుంచారు. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని, అదేవిధంగా గతంలో మాదిరిగా ధర్నా నిర్వహిస్తామని అధికారులకు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సంఘం(టీఎస్ఏఎస్) హెచ్చరించింది.
ఐదో రోజు కొనసాగుతున్న నిరసనలు
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలు ఆదివారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నాయి. విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్‌లో ర్యాలీగా బయలుదేరి తమ డిమాండ్లతో కూడిన నినాదాలు చేశారు. ఐదు రోజులుగా నిరసనలు చేస్తున్న స్పందన లేదని, వీసీ క్యాంపస్‌లోనే ఉండి కూడా మా ఆందోళనలను లెక్క చేయడం లేదని మండిపడ్డారు. ఇలాంటి వీసీ మాకు వద్దని వెంటనే రెగ్యూలర్ వీసీని నియమించాలని కోరారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే ధర్నాకు దిగడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులకు హెచ్చరించారు.
విద్యార్థుల డిమాండ్లు..