అజ్ఞానాన్ని తొలగించి.. విజ్ఞానాన్ని ప్రసాదించేవారే గురువులని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కొనియాడారు.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్ సమావేశ హాలులో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ప్రభుత్వ ముందుంటుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉపాధ్యాయులంతా మద్దతుగా నిలవాలని కోరారు. అనంతరం 87 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు మెమొంటోలు, ప్రశంసా పత్రాలు అందించి ఘనంగా సన్మానించారు. కాగా, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ రావుతో కలిసి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు.
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 5 : అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగును ప్రసాదించే మార్గదర్శకు లే గురువులని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సు మన్ అన్నారు. విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జ యంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ హాలులో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రా వు, దుర్గం చిన్నయ్య, కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు గురువులకు ప్రాధాన్యత ఉందని, మనిషి జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు గురువన్నారు. గురువులతోనే విద్యార్థులు సన్మార్గంలో నడుస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చాలా మార్పులు తీసుకొచ్చిందని, మన ఊరు – మన బడితో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటుకు దీటుగా తయారు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుంటుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉపాధ్యాయులందరూ మద్దతుగా ఉండాలని కోరారు. అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులకు మెమొంటో, ప్రశంసా పత్రం అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అంతకు ముందు కేంద్రీయ విద్యాలయం, అభ్యాస స్కూల్ పిల్లలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్, డీఈ వో యాదయ్య, డీఆర్డీవో శేషాద్రి, జడ్పీ సీఈవో నరేందర్, ఎంఈవో పోచయ్య, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, ఎస్వోలు చౌదరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
వీవోఏల కృషి అభినందనీయం
నస్పూర్, సెప్టెంబర్ 5 : మహిళా సంఘాల అభివృద్ధిలో వీ వోఏల కృషి అభినందనీయమని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ప్రభుత్వం వీవోఏలకు వేతనం రూ. 8 వేలు పెంచిన సందర్భంగా మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంత రం ఏర్పాటు చేసిన సమావేంలో కలెక్టర్ బదావత్ సంతోష్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి హాజరై బాల్క సుమన్ మాట్లాడారు. పొదుపు సంఘాల్లోని మహిళలను సంఘటితం చేసి చైతన్య పరుస్తూ సమన్వయ కర్తలు గా వ్యవహరిస్తున్న గ్రామ సంఘం సహాయకుల సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ వేతనాలు పెంచారని తెలిపారు. రా ష్ట్రంలో 17,608 మంది వీవోఏలకు లబ్ది చేకూరిందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 468 గ్రామసంఘ సహాయకుల వేతనం రూ. 8 వేలు పెంచినందుకు రూ. 10 లక్షలు అదనంగా చెల్లించడం జరుగుతుందని తెలిపారు. జి ల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, మున్సిపల్ చైర్మన్ ప్ర భాకర్, జడ్పీటీసీలు, వీవోఏలు పాల్గొన్నారు.
పరిష్కారం బీఆర్ఎస్తోనే సాధ్యం
రామకృష్ణాపూర్, సెప్టెంబర్ 5: ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారం బీఆర్ఎస్తోనే సాధ్యమని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంగళవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని తన స్వగృహంలో నియోజక వర్గ మైనార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల అభ్యున్న తికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. మైనార్టీ బంధు ను ముస్లింల కోసం ఏర్పాటు చేసి అందిస్తున్నదని తెలిపా రు. మూడోసారి రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని, మైనార్టీ లు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపాలని కోరారు. అనంత రం నియోజక వర్గ ముస్లిం మైనార్టీ నాయకులు బాల్క సు మన్కు మద్దతు తెలిపి శాలువాలతో ఘనంగా సన్మానించా రు. బీఆర్ఎస్ పార్టీ రామకృష్ణాపూర్ పట్టణాధ్యక్షుడు, పట్టణ మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, క్యాతనపల్లి మున్సిపాల్ కో-ఆప్షన్ సభ్యుడు యాకూబ్అలీ, ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకుడు (మందమర్రి) ఎండీ అబ్బాస్, మైనార్టీ మందమర్రి పట్టణాధ్యక్షుడు ఇసాక్, ముస్తాఫా, చె న్నూరు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు అజ్గర్ పాల్గొన్నారు.
ఉత్తమ సేవలకు గుర్తింపు..
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 5 : నస్పూర్‌లోని కలెక్టరేట్లో విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్‌నేతకాని, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్య, కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్, డీఈవో యాద య్య, డీఆర్డీవో శేషాద్రి, జడ్పీ సీఈవో నరేందర్ 87 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు మెమొంటోలు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, కేజీబీవీల నుంచి 54 మంది, సోషల్ వెల్ఫేర్ నుంచి నలుగురు, బీసీ గురుకుల పాఠశాలల నుంచి ఇద్దరిని, ప్రైవేటు పాఠశాలల నుంచి 30 మందిని ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కాగా, 90 మందికిగాను ముగ్గురు గైర్హాజరయ్యారు.