Cannabis Plants | ఇంటి ఆవరణలో గంజాయి మొక్కల పెంపకం.. యజమాని అరెస్ట్
Cannabis Plants | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామ పంచాయతీలోని గుండ్ల పహాడ్ గ్రామంలో ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామ పంచాయతీలోని గుండ్ల పహాడ్ గ్రామంలో ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు ( Cannabis Plants ) పెంచుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు( Arrest ) చేశారు. గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకొని, మొక్కలు పెంచుతున్న మడావి అర్జు ను అరెస్ట్ చేసినట్లు సీఐ పర్స రమేష్, ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
ఇంటి ఆవరణలో ఎవరికీ కనిపించకుండా చీరలు కట్టి, చిక్కుడు పొదుల చాటున గంజాయి మొక్కలను పెంచుతున్నాడని వివరించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఎస్సై ఆంజనేయులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నిందితుడి నివాసంపై దాడి చేసి సుమారు 8 అడుగుల ఎత్తు పెరిగిన 5 గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారని వివరించారు.
గంజాయి మొక్కల విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని అంచనా వేసి కేసు నమోదు చేశామన్నారు. సంఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ సందర్శించారు. గంజాయి క్రయ, విక్రయాలు చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Murasu | మురాసు తుపాను ప్రభావం.. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు!
RGV | హింసకు సినిమాలే కారణమంటే… కిడ్నాప్‌లకు రామాయణాన్ని అనాల్సిందే: ఆర్జీవీ
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

