ఎదులాపురం, మే 10 : రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రంగినేణి శ్రీనివాస్‌రావు శనివారం హైదరాబాద్‌లోని కల్వకుంట్ల కవిత నివాసంలో కుటుంబ సమేతంగా మర్యా ద పూర్వకంగా కలిశారు.
ముందుగా ఆదిలాబాద్ జిల్లాలో జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన, చేపట్టబోయే సేవా కార్యక్రమాలను చర్చించారు. క్షేత్రస్థాయిలో జాగృతి బలపర్చాలని కవిత సూచించారు. ప్రజల సమస్యలను ప్రశ్నిస్తూ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు.