ప్రజల ప్రాణాలకంటే ఖజానా ముఖ్యమా?
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే ఖజానా ముఖ్యమైందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం ఈజ్గాం గ్రామంలోని వైన్ షాపు ను తరలించాలంటూ ఆదివారం మహిళలు చేపట్టిన నిరసనకు ఆయన మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఖజానా నింపుకోవడం కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదన్నారు.
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ఈజ్‌గాంలోని వైన్స్‌ను తరలించాలని మహిళల నిరసన
- మద్దతు తెలిపిన ఆర్ఎస్పీ
కాగజ్‌నగర్, నవంబర్ 30 : కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే ఖజానా ముఖ్యమైందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం ఈజ్గాం గ్రామంలోని వైన్ షాపు ను తరలించాలంటూ ఆదివారం మహిళలు చేపట్టిన నిరసనకు ఆయన మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఖజానా నింపుకోవడం కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదన్నారు.
ఈజ్గాంలో నివాసాల మధ్య వైన్ షాప్ ఏర్పాటు చేయడం వల్ల మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారన్నారు. వైన్ షాప్ త రలించాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎక్సై జ్ కమిషనర్‌కు లేఖ రాసినా పట్టించుకోవడం లేదని, ఇకనైనా స్పందించకుంటే గ్రామస్తులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ, గోలెం వెంకటేశ్, ఈజ్గాం నాయకులు అనూప్, అషుతోష్ మండల్, రింకూ మండల్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్తో కలిసి నడువాలి : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడువాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పట్టణంలో సిర్పూర్(టీ) మండల మాజీ ఎంపీపీ మాలతి-మనోహర్ ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరగా, ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేసింది లేదని, పదవి వచ్చిన తర్వాత ప్రజలకు దూరమయ్యారని, స్థానిక నాయకులను అణిచివేసే ధోరణితో పని చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి, ఆయనతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకొని బీఆర్ఎస్లో చేరామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ, తన్నీరు పోచం, నక మనోహర్, వాసు, చాంద్ పాషా పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

