ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే)లో గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించడంతో శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.
ఆకులతో గ్రీన్ రంగోలి వేసి కేసీఆర్ చిత్రపటం పెట్టి దేశ్‌కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేశాయి. ఎంపీటీసీ గాడ్గె సుభాష్, సర్పంచ్ గాడ్గె మీనాక్షి, గ్రామస్తులు పాల్గొన్నారు.
– ఇచ్చోడ, డిసెంబర్ 8