Sheikh Hasina | ప్రాణహాని ఉన్నా ఈ ఏడాది మా దేశం తిరిగి వెళ్తా.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడి
Sheikh Hasina : రెండేళ్లకుపైగా ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది ఎలాగైనా తన స్వదేశం తిరిగి వెళ్తానని ప్రకటించారు. ఒకవైపు ఆమెకు ప్రాణహాని ఉన్నా, తన పార్టీపై నిషేధం ఉన్నా తను మాత్రం ఈ ఏడాది బంగ్లాదేశ్ తిరిగి వెళ్తానని చెప్పారు.
Sheikh Hasina : రెండేళ్లకుపైగా ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది ఎలాగైనా తన స్వదేశం తిరిగి వెళ్తానని ప్రకటించారు. ఒకవైపు ఆమెకు ప్రాణహాని ఉన్నా, మరణశిక్ష విధించాలని డిమాండ్లతోపాటు ఆమె పార్టీపై నిషేధం ఉన్నా తను మాత్రం ఈ ఏడాది బంగ్లాదేశ్ తిరిగి వెళ్తానని చెప్పారు. ఆమె పార్టీ అవామీ లీగ్ ఈ ఏడాది జూన్ 23న 77 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇండియాలోని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు.
‘‘నేను బంగ్లాదేశ్ తిరిగి వెళ్లడం నా వ్యక్తిగతమైన లక్ష్యం కోసం కాదు. అది బంగ్లాదేశ్ ప్రజల రాజకీయ ఆకాంక్షల కోసం. అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం. విముక్తి కోసం జరిగిన పోరాట స్ఫూర్తి కోసం. చట్టాన్ని పరిరక్షించేందు కోసం నేను వెళ్తా. నేను అధికారం కోసం రాజకీయాలు చేయను. బంగ్లాదేశ్ ప్రజల సంక్షేమం కోసం, వారి ఆకాంక్షల్ని నెరవేర్చడం కోసం, బంగ్లా జాతిపిత బంగబంధు షేక్ ముజిబర్ రహమాన్ కలలుగన్న సోనార్ బంగ్లాను సాధించడం కోసమే రాజకీయాలు చేస్తా’’ అన్నారు. తనకు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించడంపై కూడా షేక్ హసీనా స్పందించారు. ఆ తీర్పు రాజకీయ ప్రేరేపితం, అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం అని ఆమె అన్నారు. బంగ్లాదేశ్ న్యాయవ్యవస్థ రాజకీయ వేధింపులు, ప్రతీకార చర్యలకు కేంద్ర బిందువుగా మారిందని హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. తన పార్టీ అయిన అవామీ లీగ్ నేతలపై ప్రతీకార చర్యలు తీసుకుంటూ, నాయకుల్ని లేకుండా చేస్తున్నారని విమర్శించారు. చావుకు తాను భయపడనన్నారు. 1975లోనే తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల్ని కోల్పోయానన్నారు. ఆ తర్వాత తనపై కూడా గ్రెనేడ్ దాడి జరిగిందన్నారు.
తనపై ఎన్నో కుట్రలు జరిగాయని, వాటన్నింటినీ దాటుకుని బంగ్లాదేశ్ ప్రజల కోసం నిలబడ్డానని చెప్పారు. ఐదుసార్లు దేశ ప్రజలు తనను ప్రధానిగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. తన జీవితం మొత్తాన్ని బంగ్లాదేశ్ కోసం, అవామీ లీగ్ కోసం ధారపోశానని చెప్పుకొచ్చారు. తనకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నింటినీ దాటుకుని బంగ్లాదేశ్ వెళ్తానని షేక్ హసీనా స్పష్టం చేశారు. తన పార్టీ అవామీ లీగ్ ఒక బలమైన రాజకీయ శక్తి అని, త్వరలోనే తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు సందర్భంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి ఇండియా చేరుకున్నారు. రెండేళ్లకుపైగా ఆమె ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఇదే సమయంలో హసీనాను అక్కడి పాలకులు, కోర్టులు దేశం నుంచి బహిష్కరించాయి. ఆమెకు మరణశిక్ష కూడా విధించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

