Womens T20 World Cup | సెమీస్‌లో వెస్టిండీస్.. డిఫెండింగ్ ఛాంపియన్ ఔట్..!
Womens T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్ నుంచి న్యూజిలాండ్(Newzealand) నిష్క్రమించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో భారీ ఓటమితో ఉసూరుమంటూ ఇంటిదారి పట్టింది
Womens T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్ నుంచి న్యూజిలాండ్(Newzealand) నిష్క్రమించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో భారీ ఓటమితో ఉసూరుమంటూ ఇంటిదారి పట్టింది వైట్ ఫెర్న్స్. డిఫెండింగ్ ఛాంపియన్‌గా లీగ్‌లో అడుగు పెట్టిన కివీస్.. పేలవమైన ప్రదర్శనతో వెనకబడింది. ఇంగ్లండ్‌పై గెలిస్తే ముందుకెళ్లే అవకాశమున్నా.. సమిష్టి వైఫల్యంతో వెస్టిండీస్‌కు మార్గాన్ని సుగమం చేసింది.
కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఇంగ్లండ్ ధాటికి న్యూజిలాండ్ చేతులెత్తేసింది. 163 రన్స్ కొట్టినా మ్యాచ్‌ను కాపాడుకోలేక లీగ్ దశలోనే కివీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఓపెనర్లు మేలియా కేర్(42), ఇసబెల్లా గేజ్(28)లు దూకుడుగా ఆడి 70 రన్స్‌తో శుభారంభమిచ్చారు. కానీ, ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని మిడిలార్డర్ పరుగులు చేయకపోవడంతో భారీస్కోర్ సాధ్యపడలేదు.
West Indies’ defeat to Ireland opened a window of opportunity for New Zealand to reach the #T20WorldCup semi-finals.
That window was decisively slammed shut again by England, with Bates, Devine and Tahuhu denied a fairytale finish in a tournament of errors for the White Ferns pic.twitter.com/wnup0VtntH
— Cricinfo (@cricinfo) June 28, 2026
ఇక ఛేదనలో అమీ జోన్స్(17) విఫలమైనా..డానీ వ్యాట్(89 నాటౌట్), సోఫియా డంక్లే(49)లుబౌండరీలతో చెలరేగి. వైట్ ఫెర్న్స్ బౌలింగ్ దళానికి చుక్కలు చూపించిన ఈ ద్వయం 9 వికెట్లతో ఇంగ్లండ్‌ను గెలిపించింది. దాంతో.. గ్రూప్ బీ నుంచి సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఐదుకు ఐదు విజయాలతో ఇంగ్లండ్ నాకౌట్‌కు దూసుకెళ్లగా.. ఐర్లాండ్ చేతిలో ఓడినప్పటికీ వెస్టిండీస్ సెమీస్ బెర్తు దక్కించుకుంది. చావోరేవో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడడం విండీస్‌కు కలిసొచ్చింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

