కోటపల్లి : రాష్ట్రంలో దౌర్జన్యపాలన కొనసాగుతుంది. మంత్రుల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను అరెస్టు ( BRS leaders arrest ) చేసి స్టేషన్‌కు తరలించడం పరిపాటిగా మారింది. శుక్రవారం రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్( Minister Vivek ) పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి ( Kotapalli ) మండలం దేవరవాడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంట నష్టం సందర్శనకు మంత్రి రానుండగా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు అసంపల్లి అనిల్ , అసరెల్లి నూతన్, గడ్డి శంకర్‌ను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ అరెస్ట్ , కేసులు ఎన్ని పెట్టినా బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కోసం అలుపెరుగని పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. పంట నష్టం సర్వే కు వచ్చిన మంత్రి వివేక్ నష్ట పోయిన పంటలకు ఎకరానికి 50 వేల పరిహారం అందచేయాలని డిమాండ్ చేశారు.