పెంబి, ఆగస్టు 17 : సంస్కృతీ, సంప్రదాయాలు అంతరించి పోకుండా కాపాడాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భుక్యా జాన్సన్ నాయక్ అన్నారు. ఆదివారం మండలం లోని లోతోర్యతాండ, తాటిగూడ గ్రామాలలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
సంప్రదాయ పాటలపై నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేందర్రెడ్డి, నాయకులు భుక్యా గోవింద్, తానాజీ, పరశురాం, మహేందర్, గాండ్ల శంకర్ పాల్గొన్నారు.