బోథ్, జూన్ 18: మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలు దూరమయ్యాయని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సొనాలలో మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వేసవిలో నీటి కోసం మహిళలు పడరాని పాట్లు పడేవారన్నారు. ప్రస్తుతం ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేయడంతో కావాల్సిన నీళ్లు వస్తున్నాయన్నారు. గ్రామానికి చెందిన రేణుకాబాయి మాట్లాడుతూ కేసీఆర్ తమ నీటి కష్టాలు తీర్చారని, బిందె పట్టుకొని నీటి కోసం బయటకు వెళ్లే పరిస్థితి దూరం చేశారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సదానందం, మిషన్ భగీరథ వాటర్‌గ్రిడ్ ఏఈ సునీల్, ఏఈ కళ్యాణ్ చక్రవర్తి, ఉపసర్పంచ్ గంగామణి, పంచాయతీ కార్యదర్శి స్వామి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బోథ్ మండలంలో..
బోథ్, జూన్ 18: మండలంలోని వజ్జర్, కేశవ్గూడ, చింతల్బోరి, నాగాపూర్, కౌఠ(బీ), సాకెర, బీర్లగొంది, మందబొగూడ, బోథ్, సొనాలలోని గ్రామాల్లో సర్పంచ్‌లు, అధికారులు, గ్రామస్తులు ర్యాలీ తీశారు. మంచినీళ్ల ట్యాంకుల వద్ద బ్యానర్లతో ప్రదర్శనలు నిర్వహించారు. ట్యాంకుల వద్ద రంగురంగులతో ముగ్గులు వేశారు. పంచాయతీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో నీటిని పొదుపుగా వాడుతున్న వారిని ఎంపిక చేసి శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు సురేందర్‌యాదవ్, రాధిక, కోవ సుమిత్రబాయి, ఆడె చాంగుబాయి, శిరీష, పంచాయతీ కార్యదర్శులు, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇచ్చోడ మండలంలో…
ఇచ్చోడ, జూన్ 18: మండల కేంద్రంతో పాటు మల్యాల్, సిరిచెల్మ, నర్సాపూర్, గేర్జం, ముక్రా(కే), దాబా కోకస్మన్నూర్ గ్రామాల్లో తెలంగాణ మిషన్ భగీరథ మంచినీళ్ల పండుగను అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. మిషన్ భగీరథ ట్యాంకుల వద్ద పూజలు చేసి ర్యాలీ తీశారు. నీటిని సరఫరా చేసే కార్మికులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సునీత, లక్ష్మి, మీనాక్షి, ఎంపీటీసీలు సుభాష్, వెంకటేశ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
సిరికొండలో..
సిరికొండ మండలంలోని పోచంపల్లి, వాయిపేట్, కుంటగూడ, ధర్మసాగర్, సోంపెల్లి గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు మిషన్ భగీరథ ట్యాంకు దగ్గర పూజలు చేశారు. మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు విజయబాయి, లక్ష్మి, గంగారాం, చంద్రకళ, పంచాయతీ కార్యదర్శులు స్వప్న, సునీల్, జైపాల్, అనిల్, గ్రామపటేల్ లచ్చు పాల్గొన్నారు.
స్వరాష్ట్రంలో తీరిన తాగునీటి కష్టాలు
తాంసి, జూన్ 18: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రజలకు తాగునీటి కష్టాలు తీరాయని జడ్పీటీసీ తాటిపల్లి రాజు, ఎంపీడీవో ఆకుల భూమయ్య అన్నారు. మండలంలోని బండల్నాగపూర్ గ్రామంలో మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజులాశ్రీధర్రెడ్డితో కలిసి జడ్పీటీసీ మిషన్ భగీరథ ట్యాంకు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో మంచినీళ్ల పండుగను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగుల వెంకన్న, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రశాంత్, సర్పంచ్‌లు స్వప్నరత్న ప్రకాశ్, కృష్ణ, సదానందం, అశోక్, తూర్పుబాయి, కుంట సరిత కేశవ్ రెడ్డి, భరత్, వార్డు సభ్యులు కొక్కురు లక్ష్మీదేవారెడ్డి, రాఘవేంద్ర ధారవేణి పాల్గొన్నారు.
భరీరథ జలం.. ఆరోగ్యప్రదాయిని
భీంపూర్, జూన్18: సీఎం కేసీఆర్ ఇంటింటికీ సరఫరా చేస్తున్న భగీరథ జలం…ఆరోగ్యప్రదాయిని అని సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు మడావి లింబాజీ అన్నారు. భీంపూర్‌తో పాటు గ్రామాల్లో సర్పంచ్‌లు, కార్యదర్శులు, కార్మికులు భగీరథ ట్యాంకులను శుభ్రం చేయిస్తూ శుద్ధజలం అందేలా చేశారు. ఇంకుడుగుంతల నిర్మాణంతో నీటిని పొదుపు చేస్తున్న మహిళలను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ , ఎంపీపీ కుడిమెత రత్నప్రభ , వైస్‌ఎంపీపీ గడ్డం లస్మన్న, ఎంపీవో వినోద్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు , నాయకులు రాథోడ్ ఉత్తమ్, ముకుంద సంతోష్, అనిల్, నరేందర్‌యాదవ్, పురుషోత్తం, ఆకటి నరేందర్‌రెడ్డి, కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి, కపిల్, వైభవ్, పంచాయతీ కార్యదర్శులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.
ఆడబిడ్డకు అండగా మిషన్ భగీరథ
నేరడిగొండ, జూన్ 18 : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ మంచినీటి కష్టాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచారని జడ్పీటీసీ జాదవ్ అనిల్ అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. నేరడిగొండలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తాగునీటి సమస్యతో దశాబ్దాల పాటు ఇబ్బందులు పడ్డ ప్రజలకు స్వరాష్ట్రంలో మిషన్ భగీరథతో సీఎం కేసీఆర్ శాశ్వత పరిషారం చూపించారన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ పెంట వెంకటరమణ, ఉపసర్పంచ్ దేవేందర్‌రెడ్డి, ఎంపీడీవో అబ్దుల్సమద్, ఎంపీవో శోభన, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.