ఉట్నూర్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలలో ( Better Education ) మెరుగైన విద్య అందుతుందని మాజీ ఎంపీపీ పంద్రా జైవంత్ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని ఘన్పూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పిల్లలచే మాజీ ఎంపీపీ అక్షరభ్యాసం చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులను క్రమం తప్పకుండా బడికి పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
షాంపూర్ గ్రామంలో ..
మండలంలోని షాంపూ గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపాలని ఉపాధ్యాయుడు భరత్ అన్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు . కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్, నగేష్, అంగన్వాడీ టీచర్ కాటం సంగీత, ఆశా లక్ష్మీ, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.