బెల్లంపల్లిరూరల్, జనవరి 20 : బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ కోట శివకృష్ణ ఉత్తమ విస్తరణ విభాగపు శాస్త్రవేత్తగా రాష్ట్రస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. శనివారం హైదరాబాద్లో ఏరువాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయనను సత్కరించి అవార్డు అందజేశారు.
గ్రామీణ రైతుల అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించి ఉత్తమ శాస్త్రవేత్తగా ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉందని డాక్టర్ కోట శివకృష్ణ తెలిపారు. ఏరువాక సంస్థకు, ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులకు, రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.