సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 28 : గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్ పేర్కొన్నారు. శనివారం నస్పూర్ మున్సిపాలిటీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ గుండె సంబంధిత వ్యాధుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఆశ కార్యకర్తలకు బీపీ, మధుమేహం పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుండె సంబంధిత వ్యాధులపై వైద్యులు అవగాహన కల్పించారు.
అనంతరం డీఎంహెచ్వో మాట్లాడుతూ మారుతున్న ఆహారపు అలవాట్లతోనే వ్యాధులు పెరుగుతున్నాయన్నారు.ప్రతి రోజూ వ్యాయామం చేయాలని, నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. అనంతరం పొగాకు వాడడం వల్ల కలిగే అనర్థ్ధాలు, వ్యాధులపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుర్మిళ్ల వేణు, కమిషనర్ చిట్యాల సతీశ్, వైద్యులు అనిత, సమత, శివప్రతాప్, రుబీనా, సూపర్వైజర్లు, లక్ష్మణస్వామి, వెంకట్, ఆరోగ్య కార్యకర్త వెంకటసాయి, డీపీహెచ్ఎన్ పద్మ, సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.