బజార్హత్నూర్, డిసెంబర్ 23 : పంట కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరికి నిరసనగా నేడు చేపట్టినున్న బజార్హత్నూర్ బంద్‌ను విజయవంతం చేయాలని అఖిల పక్ష రైతు నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మండలకేంద్రంలోని ప్రా థమిక వ్యవసాయ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధా న్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయకుండా బుటకపు మాటలు చెబుతూ కాలయాపన చేయడంపై మండిపడ్డారు.
రంగు మారిన సోయబీన్, మొక్కజొన్న పంటలను వెంటనే కొనుగోలు చేయాలన్నారు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా కాకుండా ప్రతి రైతుకూ ఎప్పటిలా యూరియా బస్తాలు ఇవ్వాలని కోరారు. మండలకేంద్రంలోని వ్యాపార సముదాయలు, స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌ను విజయవంతం చేయాలని వ్యాపారులు, ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు శేఖర్, వినీల్ శంకర్, రాములు, గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.