ఆడబిడ్డలకు సర్కారు సారె
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కారు ముహూర్తం ఖరారు చేసింది. మంచిర్యాల జిల్లాకు 2,83,909, ఆసిఫాబాద్ జిల్లాకు 1,91,065 కానుకలు చేరుకోగా, నేటి నుంచి రేషన్ దుకాణాల
- నేటి నుంచి బతుకమ్మచీరల పంపిణీ
- రేషన్ దుకాణాల ద్వారా అందజేత
- 18 ఏండ్లు నిండినవారంతా అర్హులు
- ఆసిఫాబాద్ జిల్లాలో 1,91,065 మందికి..
- మంచిర్యాలలో 2,83,909 మందికి..
- దండేపల్లి మండలంలో ప్రారంభించనున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు
- ఆనందంలో మహిళలు
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కారు ముహూర్తం ఖరారు చేసింది. మంచిర్యాల జిల్లాకు 2,83,909, ఆసిఫాబాద్ జిల్లాకు 1,91,065 కానుకలు చేరుకోగా, నేటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా అందించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆకర్షణీయమైన రంగులు.. 240 వెరైటీలతో సారె మెరిసిపోతుండగా, మహిళాలోకం మురిసిపోతున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 21 : మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ నెల 22 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఆడపడుచుకు రేషన్ దుకాణాల ద్వారా చీరలను అందించనున్నారు. 24 రకాల డిజైన్లు.. 10 రంగుల్లో.. 240 వెరైటీలతో చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. 6, 9 గజాల పొడవు చీరలతో పాటు, 9×16 అంగుళాల జాకెట్ పీసుల కానుకతో మహిళలు బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోనున్నారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల్లో 423 రేషన్ దుకాణాల ద్వారా 2,83,909 చీరలు పంపిణీ చేయనున్నారు. ఇందులో బెల్లంపల్లి మండలానికి 26,656, భీమినికి 5,101, భీమారానికి 6,120, చెన్నూర్‌కు 20,364, దండేపల్లికి 19,569, హాజీపూర్‌కు 12,646, జైపూర్‌కు 12,966, జన్నారానికి 21,236, కన్నెపల్లికి 7,692, కాసిపేటకు 11,664, కోటపల్లికి 13,684, లక్షెట్టిపేటకు 19,165, మంచిర్యాలకు 31,280, మందమర్రికి 30,312, నస్పూర్‌కు 17,641, నెన్నెలకు 9,017, తాండూరుకు 11,621, వేమనపల్లి మండలానికి 7,175 చీరలు చేరుకున్నాయి. దండేపల్లి మండలం కన్నెపల్లి, గూడెం, వెల్గనూరు, కాసిపేట, కొండాపూర్, ద్వారక, ధ ర్మారావుపేట, పెద్దపేట, లక్ష్మీకాంతాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే దివాకర్‌రావు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
జిల్లాకు 1,91,065 బతుకమ్మ చీరలు చేరుకున్నాయి. కాగజ్‌నగర్ మండలంలో 19,732, కాగజ్‌నగర్ పట్టణంలో 20,186, ఆసిఫాబాద్‌లో 19,801, వాంకిడిలో 12,808, దహెగాంలో 10,754, రెబ్బనలో 12,674, తిర్యాణిలో 8,979, కౌటాలలో 13,108, సిర్పూర్-టీలో 10,159, పెంచికల్పేట్లో 6,084, బెజ్జూర్‌లో 11,659, చింతలమానెపల్లిలో 11,896, జైనూర్‌లో 10,786, కెరమెరిలో 11,924, సిర్పూర్-యులో 6,123, లింగాపూర్‌లో 4,392 మంది మహిళలకు చీరలను అందించనున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

