మంచిర్యాలటౌన్, జూన్ 9 : స్థానిక గ్రీన్ సిటీలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో విన్నర్స్, రన్నర్స్ వివరాలను జనరల్ సెక్రటరీ పుల్లూరి సుధాకర్ ఆదివారం వెల్లడించారు. విన్నర్స్, రన్నర్స్‌గా నిలిచిన క్రీడాకారులు జూన్, జూలై, ఆగస్టులో జరిగే అండర్-11, 13, 15, 17, 19 బాల బాలికలు, మెన్ అండ్ వుమెన్, మాస్టర్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
ఈ సందర్భంగా విన్నర్స్, రన్నర్స్‌కి మెడల్స్ అందజేయగా, ముఖ్యఅతిథిగా ఎస్టీపీపీ డీజీఎం పంతులు, పాత మంచిర్యాల కాంగ్రెస్ నాయకుడు బొలిశెట్టి కిషన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ బాధ్యులు సత్యపాల్ రెడ్డి, రమేశ్‌రెడ్డి, మధు, కృష్ణ, రాజలింగు, హర్ష, నరేందర్, రూబీ అకాడమీ బాధ్యుడు నరసింహ స్వామి, క్రీడాకారులు పాల్గొన్నారు.
అండర్-11 బాలురు సింగిల్స్‌లో విజేతగా శరవణన్, అండర్-13 బాలురు సింగిల్స్ విజేతగా మన్విత్, రన్నరప్‌గా శర్వానంద్, అండర్-15 బాలురు సిం గిల్స్ విజేతగా మన్విత్, రన్నరప్‌గా ఈ శ్వర్ ప్రసాద్, అండర్-15 బాలురు డబుల్స్ విజేతలుగా బన్నీ, షన్ను, రన్నర్స్‌గా ధనుష్, ఈశ్వర్ప్రసాద్, అండ ర్-17 బాలురు సింగిల్స్ విజేతలుగా ఆదిత్య, రన్నరప్‌గా రాము, అండర్-17 డబుల్స్‌లో విజేతలుగా ఆకర్శ్, లక్ష్మణ్, రన్నరప్‌లుగా రుతురాజ్, నెహిమయ్య,
అండర్-19 బాలురు సింగిల్స్ విజేతగా ఆదిత్య, రన్నరప్‌గా రాము, డబుల్స్‌లో అఖిల్, సాత్విక్, మెన్స్సింగిల్స్లో విజేతగా రాజేశ్, రన్నరప్‌గా ఆదిత్య, మెన్స్ డబుల్స్‌లో విజేతగా భీమారావ్, సాయి, అండర్-11 బాలికల్లో హర్షిత, డబుల్స్‌లో హర్షిత, త్రిష, అండర్-13 సింగిల్స్‌లో సహస్ర, డబుల్స్‌లో ఆషు, ఆరాధ్య, అండర్-15 సింగిల్స్‌లో అనన్య, డబుల్స్‌లో అనన్య, ఆషు, అండర్-17 సింగిల్స్‌లో అనన్య, అండర్-19 సింగిల్స్‌లో శ్రీవల్లి, వుమెన్స్ సింగిల్స్‌లో శ్రీవల్లి విజేతలుగా నిలిచారు.