ఆదిలాబాద్ : డాక్టర్ బాబు జగ్జీవన్రాం (Babu Jagjivanram) సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ( MLA Anil Jadhav ) అన్నారు. జగ్జీవన్రాం జయంతి సందర్భంగా నెరడిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం, కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన బడుగు బలహీన వర్గాల నేత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శివారెడ్డి, మాజీ జడ్పీటీసీ జహీర్,మాజీ ఎంపీపీలు రాథోడ్ సజన్, మాజీ వైస్ ఎంపీపీ మహేందర్ రెడ్డి, నెరడిగొండ వీడీసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, నాయకులు పండరీ, రుక్మన్ సింగ్, గులాబ్, ప్రతాప్, రమేష్, సవాయ్, లింబాజి, కమలాకర్, శేఖర్,తదితరులు పాల్గొన్నారు.