అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డిని మూడు రోజుల క్రితమే బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన స్థానంలో ఆశిష్ సంగ్వాన్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూపరిపాలనా విభాగంలో ప్రత్యేకాధికారిగా పని చేస్తున్న 2016 బ్యాచ్‌కు చెందిన ఆశిష్ సంగ్వాన్‌ను నిర్మల్ కలెక్టర్‌గా నియమించారు. వెంటనే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
-నిర్మల్ టౌన్, అక్టోబర్ 13