లోకేశ్వరం : గ్రామాభివృద్ధి కోసం చేపట్టిన అభివృద్ధి పనులకు చెల్లించాల్సిన బకాయిల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం అన్యాయమని మాజీ సర్పంచులు (Former Sarpanches) ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆందోళనను గాంధేయ మార్గంలో చేస్తున్నా గాని పోలీసులు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేయడం దుర్మార్గమని మాజీ సర్పంచులు భుజంగ్ రావు, కపిల్, సాయన్న, దిగంబర్ ఉన్నారు.
అప్పులు చేసి గ్రామాలలో అనేక పనులు చేసి తిప్పలు పడుతున్న మాజీలు అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని నిలదీస్తే చలనం లేకుండా బిల్స్ ( Bills ) విడుదల చేయకుండా అరెస్టులతో మనోవేదనకు గురిచేస్తుందని వాపోయారు. ప్రభుత్వం మొండివైఖరిని వీడి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం చేసిన పనుల బిల్లులను వెంటనే విడుదల చేసి ప్రజాప్రతినిధుల గౌరవం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.