ఇంద్రవెల్లి : మండలంలోని దస్నాపూర్ గ్రామంలో నూతన ఆంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవం, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన (Anjaneyaswamy statue) కార్యక్రమ అంగరంగ వైభవంగా జరిగింది. రెండు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, కలశంతో శోభాయాత్ర నిర్వహించి ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఈ సందర్భంగా బాలు మహారాజ్ భక్తులకు ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రతీ ఒక్కరు ఏదో ఒక రకంగా ఒత్తిడికి గురవుతున్నారని, దైవ చింతన అలవర్చుకోవాలని సూచించారు. దైవ చింతన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. గ్రామంలోని పెద్దల సహకారంతో విరాళాలు సేకరించి ఆలయాన్ని నిర్మించనట్లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ పొటులే పుండలిక్, జవాదే కేశవ్, కరాడే మారుతి, పోటే సాయినాథ్, నాందేవ్, సంతోష్, ప్రకాష్, గజానంద్, తదితరులు పాల్గొన్నారు.