గుడిహత్నూర్, సెప్టెంబర్ 30 : ‘సమస్యలు తెలిసిన వాడిని.., కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి అండగా ఉంటా..’ అని బీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ అభ్యర్థి అనిల్ జాదవ్ ప్రజలను కోరారు. మండలంలోని మచ్చాపూర్, కొలాంగూడ, కొద్దుగూడ గ్రామాల్లో శనివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొనగా, ప్రతీ గ్రామంలో ప్రజలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో కాలినడకన తిరుగుతూ ప్రచారం చేశారు. అనంతరం ఆయన సమక్షంలో 50 మంది బీజేపీ యువకులు బీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా సమావేశాలోల అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని పథకాలు మన రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్నదన్నారు. అన్ని రకాల అభివృద్ధి పనులు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల కోసం సాధ్యం కాని పథకాలపై హామీలు ఇస్తున్న కాంగ్రెస్, బీజేపీల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ప్రజల సమస్యలు తెలిసిన సీఎం కేసీఆర్‌ను మరోసారి సీఎంగా గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంగీత ఆడె, సర్పంచుల సంఘం అధ్యక్షుడు జీ తిరుమల్‌గౌడ్, గ్రామ పటేళ్లు జంగు, కోవ ప్రభాకర్, ఎంపీటీసీ శగీర్ఖాన్, ఉప సర్పంచ్ తులసీరాం, మంతు, మాధవ్ పటేల్, సిద్ధార్థ్ ససానే, ఎండీ గఫార్, మాజీ సర్పంచులు రవీందర్, ప్రతాప్, నాయకులు ఆడె గుణవంత్‌రావ్, శ్యామ్‌రావ్, రమేశ్ జాదవ్, భీంరావ్, దేవన్న, జాదవ్ రాంజీ, తెలంగే మాధవ్, రావణ్, ఇమ్రాన్‌ఖాన్, నిఖిల్, దోమకొండ సుధాకర్, వివిధ గ్రామాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.