భైంసాటౌన్, డిసెంబర్ 20 : పోషకాహారం లోపంతో బాధపడే చిన్నారులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భావి పౌరులుగా ఎదగాల్సిన పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండా లనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంక్షే మ పథకాలను అమలు చేస్తున్నది. వయస్సుకు తగిన బరువు, ఎత్తు ఉండేలా పోషకాహారాన్ని అందజేస్తున్నది. ఇందుకోసం ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సంబంధించిన ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నది. పోషకాహార లోపం ఉన్న వారిని గుర్తించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకుంటున్నది.
చిన్నారుల హెల్త్ ప్రొఫైల్ కోసం అంగన్వాడీ కేంద్రాలకు పర్యవేక్షణ కార్డులను అందజేసింది. వాటిలో ఎప్పటికప్పుడు పిల్లల వివరాలను పొందుపరిచి తల్లిదండ్రులకు అందజేస్తున్నారు. మండలంలో 105 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 6 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 7 నెలల నుంచి మూడేళ్ల వయస్సు ఉన్న 3531 మంది 3 నుంచి 6 సంవత్సరాల లోపు 2356 మంది చిన్నారులు ఉన్నారు. తల్లిదండ్రుల వద్ద ఆరోగ్య సమాచారం.
అంగ్వాడీ చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గతంలో వారి తల్లిదండ్రులకు తెలిసేది కాదు. ప్రభుత్వం హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందించడం ద్వారా ఎప్పటికప్పుడు చిన్నారుల ఆరోగ్య సమస్యలపై తల్లిదండ్రులకు తెలిసే అవకాశం కలిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు గుడ్లు, పాలు, బాలామృతం, స్నాక్స్‌తో పాటు పూర్ణ ప్రాథమిక విద్య అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారంతో చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎదుగుతున్నారు. కొంత మంది చిన్నారుల్లో పోషకాహార లోపం కనిపిస్తుండడంతో హెల్త్ ప్రొఫైల్ కార్డులో వారి వ్యక్తిగత సమాచారం నమోదు చేస్తున్నారు. తద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేం దుకు అదనంగా పోషకాహారం అందిస్తున్నారు.
పర్యవేక్షణ కార్డు ద్వారా ఏం చేస్తారంటే..
వివరాలు నమోదు చేస్తున్నాం..
అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారుల ఎత్తు, బరువు, చుట్టు కొలతలు, వారి ఆరోగ్య సమాచారం కార్డులో నమోదు చేస్తాం. పెరుగుదల, పర్యవేక్షణ కార్డులు తల్లిదం డ్రులకు అందజేస్తాం. ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీ లోపు చిన్నారుల బరువు, ఎత్తు కొలతలు తీసుకుంటాం. చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలను తల్లిదండ్రులకు వివరిస్తాం.
– సుశీల, అంగన్వాడీ టీచర్, మహాగాం
సరైన పోషకాహారం అందిస్తున్నాం..
పోషకాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి అవసరమైన పోషకాహరాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నాం. దీని కోసం ప్రతినెలా చిన్నారుల ఆరోగ్య సమాచారాన్ని కార్డులో నమోదు చేసి వారి తల్లిదండ్రులకు అందజేస్తున్నాం. పిల్లల ఆరో గ్యంపై అంగన్వాడీ టీచర్లు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు చిన్నారుల పెరుగుదలను పరిశీలిస్తాం.
– నాగలక్ష్మి, సీడీపీవో(భైంసా)