ఎదులాపురం, ఏప్రిల్ 20 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర, బాలికల గురుకుల పాఠశాలల్లో 6,7,8 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని 12 కేంద్రాల్లో నిర్వహించిన కేంద్రాలను ఉమ్మడి జిల్లా ఆర్సీవో శ్రీధర్ పరిశీలించారు.
ఉమ్మడి జిల్లాలో 6వ తరగతిలో 1,150 మందికి 1,013 మంది, 7వ తరగతిలో 756 మందికి 663 మంది, 8వ తరగతిలో 783 మందికి 702 మంది 9వ తరగతిలో424 మందికి 379 మంది పరీక్ష రాశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,113 మందికి 2,757 మంది పరీక్ష రాయగా.. 356 మంది గైర్హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో బ్యాక్లాగ్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీసీవో ఎన్ కీర్తి తెలిపారు.
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 20 ః గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఆదివారం నిర్మల్లో ప్రవేశ పరీక్షను నిర్వహించారు. పట్టణంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలుర పాఠశాలలో నిర్వహించిన కేంద్రాన్ని ఆదివారం రెవెన్యూ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట డీఈవో రామారావు, విద్యాశాఖ అధికారులు గీత, రమణారెడ్డి, లింబాద్రి, దశరథ్ ఉన్నారు.