బజార్ హత్నూర్: పదవ తరగతి పూర్తి చేసుకుని 22 సంవత్సరాలు గడిచిన తర్వాత పూర్వ విద్యార్థులంతా ( Alumni meet ) ఒక దగ్గర కలుసుకోవడం ఆనందంగా ఉందని బజార్ హత్నూర్ ఉన్నత పాఠశాలలో చదివిన 2003- 2004 పూర్వ విద్యార్థులు అన్నారు. ఆదివారం స్థానిక తిరుమల ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి గెట్ టు గెదర్ (Get together ) ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి, టి నారాయణను శాలువలతో సత్కరించి, అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు తరగతి గదిలో జరిగిన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు( Teachers ) మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థానంలో ఉంచాలన్నదే ఉపాధ్యాయుల ఉద్దేశమని అ న్నారు. అయితే అప్పటి విద్యార్థులకు నేటి విద్యార్థులకు ఎంతో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. టెక్నాలజీ వ్యవస్థ పెరగడంతో కొంతమంది విద్యార్థులు చెడు వైపు ప్రయాణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేసిన పూర్వ విద్యార్థులను అభినందించి మాట్లాడారు.