లక్ష్మణచాంద, ఫిబ్రవరి 15 : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం లక్ష్మణచాంద మండలం పార్పెల్లి గ్రామానికి చెందిన కార్యకర్త జంగాల నరేశ్ భార్యకు పార్టీ తరఫున మంజూరైన ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. అనంతరం లక్ష్మణచాంద గ్రామానికి చెందిన భరత్ కుమార్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు.
సాయం కోసం మంత్రిని సంప్రదించగా, సీఎం సహాయనిధి ద్వారా మంజూరు చేసిన రూ.1.25 లక్షల చెక్కును బాధితుడికి అందజేశారు. అలాగే మండలంలోని వడ్యాల్ గ్రామానికి చెందిన వై రవీందర్‌కు రూ.లక్ష, చింతల్‌చాంద గ్రామానికి చెందిన రాందాస్‌కు రూ.60 వేలు, మల్లాపూర్ గ్రామానికి చెందిన నడ్పి ముత్తన్నకు రూ.52 వేలు, అదే గ్రామానికి చెందిన అశ్వినికి రూ.30 వేలు, వడ్యాల్ తండా గ్రామానికి చెందిన బీ పవన్‌కు రూ.60 వేల సీఎంఆర్ఎస్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు అల్లోల సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, ఎంపీటీసీ కళ్యాణిగోవర్ధన్, నాయకులు కేశం రమేశ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
సోన్, ఫిబ్రవరి 15 : మంజులాపూర్ పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్ రెడ్డిని మంత్రి అల్లోల పరామర్శించారు. చైర్మన్ నిర్మల్ నుంచి తన కారులో ఉప సర్పంచ్ రాజేశ్వర్, గాండ్ల నర్సయ్య సోన్‌కు వస్తుండగా, కడ్తాల్ వై జంక్షన్ వద్ద ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న మంత్రి వారిని పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సాద విజయ్‌శేఖర్, డైరెక్టర్లు బర్మదాసు, రమేశ్, నాయకులు ముత్యంరెడ్డి తదితరులు ఉన్నారు.