ఇంద్రవెల్లి మండలంలోని లంబాడాతండాల్లో తీజ్ వేడుకలు కనుల పండువగా ముగిశాయి. రాఖీ పౌర్ణమి రోజు ప్రారంభమై కృష్ణాష్ణమితో ముగిశాయి. ఈ తొమ్మిది రోజులు లంబాడా యువతులు తీజ్ బుట్టలను కూడళ్ల వద్ద పెట్టి ఆడిపాడారు. ముగింపు రోజైన గురువారం హర్కాపూర్తండా, భీంజీతండాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ పాల్గొన్నారు. తీజ్ బుట్టలను యువతులు, మహిళలు, చిన్నారులు తలపై ఎత్తుకొని సంప్రదాయ నృత్యాలు చేయగా.. వారితో ఆడిపాడారు.
పెంబి, సెప్టెంబర్ 7 : మండలంలోని తాటి గూడ గ్రామంలో తీజ్ ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. సేవాలాల్, జగదాంబ దేవి ఆలయాల్లో నియమనిష్టలతో గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ నృత్యాలతో యువ తులు వరి మొలకల బుట్టలను నెత్తిమీద పెట్టుకొని శోభాయాత్ర నిర్వహిస్తూ నృత్యాలు చేశారు. ఆనం తరం మొలకల బుట్టలను నీటిలో నిమజ్జనం చేశారు. సర్పంచ్ తానాజీ, బీఆర్ ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మండలం లోని లక్కారం, లింగోజి తండా, హస్నాపూర్, పులిమడుగు, సాకేరా, ఉమ్రి, ఏందా, జైత్రాం తండా తదితర లంబాడ తండాల్లో తీజ్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా యువతులు తొమ్మిది రోజులుగా పవిత్రం గా పూజలు నిర్వహించారు. గురువారం ఆనందో త్సాహంగా సాంప్రదాయ నృత్యాలు చేస్తూ నిమజ్జనం చేశారు. పెళ్లి కాని యువతులు గోధుమ లను చిన్న బుట్టిలో నానబెట్టి మొలకలు వచ్చిన అనంతరం తొమ్మిది రోజుల పాటు తాము కోరు కున్న కోరికలు తీరాలని కుల దైవానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.