ఎదులాపురం, డిసెంబర్ 23 : నేషనల్ ఫిజిషియన్ డే సందర్భంగా ఆల్ ఇండియా ఫిజిషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవా రం నిర్వహించిన 2కే రన్ ఉత్సాహంగా సాగింది. ఉదయం రిమ్స్ నుంచి 2కే రన్ ప్రారంభమైంది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరై క్రీడాజ్యోతిని వెలిగించి జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.
రన్ రిమ్స్ నుంచి కలెక్టర్‌చౌక్ మీదుగా ఇందిరా ప్రియదర్శిని స్డేడియం వరకు కొనసాగింది. అనంతరం వైద్య విద్యార్థులు నృత్యాలు చేశారు. నృత్యాలు ఆకట్టుకున్నాయి. డీఎస్పీ వీ ఉమేంద ర్, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎం హెచ్‌వో నరేందర్ రాథోడ్, ఏఎంఏ అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి పీ శ్యామ్ ప్రసాద్, ఏపీఐ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ సత్యనా రాయణ, ప్రధాన కార్యదర్శి సుమలత, వైస్ చైర్మన్ సందీప్ పవార్, కోశాధికారి వెంకట్ రెడ్డి, ఐడీఏ అధ్యక్షుడు సమీఉద్దీన్, ప్రధాన కార్యదర్శి సాయిరాం, టీహెచ్ఏఎన్ఏ అధ్యక్షుడు సంజయ్ గుజరాతి, వైద్యులు ఉన్నారు.