జై నూర్ : కొమురం భీం జిల్లా జైనురు మండల కేంద్రంలోని ఎస్బీఐ ఫీల్డ్ అసిస్టెంట్‌ను (Field Assistant ) వెంటనే తొలగించాలని ఆదివాసి సంఘాల సార్ మేడిలు గురువారం బ్యాంక్ ఎదుట ధర్నా ( Stage Protest ) నిర్వహించారు. ఈ సందర్భంగా మార్లవాయి సార్ మేడి గీడమ్ గణపత్ మాట్లాడుతూ గత ఆరునెలలుగా గిరిజన రైతులకు క్రాప్ లోన్ల విషయంలో స్థానిక బ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్ ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆరోపించారు.
వివిధ కారణాలను సాకుగా చూపిస్తూ క్రాప్‌లోన్లను అడ్డుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సార్ మేడిలు ఆత్రం అనంతరావు, ఆదివాసి సంఘాల నాయకులు మేశ్రం సేకు, కొడప ఆనందరావు, మడవి నాగరావ్, మహిళా రైతులు, తదితరులు పాల్గొన్నారు.