లోకేశ్వరం, అక్టోబర్ 9 : ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి పిలుపునిచ్చారు. లోకేశ్వరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం స్థానిక నాయకులు, దళిత సంఘాల నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనుసరించి ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నదన్నారు. ముఖ్యంగా దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల యూత్ అధ్యక్షుడు కపిల్, ఎంపీటీసీ జై సాగర్ రావు, లోకేశ్వరం మాజీ సర్పంచ్ శ్రీధర్, భోజన్న, బండి ప్రశాంత్, విజయ్ రావు, ఉత్తమ్, మా అమ్మనాన్న ఫౌండేషన్ చైర్మన్ ఆంజనేయులు, విఠల్, అంబకంటి శ్రీను, మోడం శంకర్, కుల పెద్దలు, ఆయా గ్రామాల దళిత సంఘాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
భైంసాటౌన్, అక్టోబర్ 9 : మండలంలోని బడ్గాం గ్రామంలో బుద్ధ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుద్ధుడి బోధనలు అనుసరించడం వల్ల మానసిక ప్రశాంతత పొందవచ్చన్నారు. అశోకుడు, అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి, ఆయన మార్గంలో నడిచారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ ఆఫీసర్ రాథోడ్ ప్రకాశ్, మైసేకర్ సాయిలు, శంకర్ చంద్రే, ధర్మాజీ తదితరులు పాల్గొన్నారు.
తానూర్, అక్టోబర్ 9 : మండలంలోని మొగిలి గ్రామంలో కుమ్రం భీం విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమి పూజ చేశారు. ముందుగా అంబేద్కర్, అన్నబావుసాటే, కుమ్రం భీం చిత్రపటాలకు పూజలు చేశారు. అనంతరం పాఠశాల అవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కుమ్రం భీం జల్, జంగల్, జమీన్ కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుండ్లిక్, హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్రావ్పటేల్, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, మాజీ ఎంపీపీలు బాషెటి రాజన్న, బాలేరావ్ లాలు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్యాదవ్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు, జెల్లావార్ చంద్రకాంత్, సొసైటీ వైస్ చైర్మన్ నాగ్నాథ్, ఎంపీటీసీ సిరిమొల్లా లక్ష్మణ్, సర్పంచులు బాలాజీ, సాయినాథ్, అబ్దుల్ గనీ, ముథోల్ అన్నబావుసాటే కమిటీ అధ్యక్షుడు ఉత్తం బాలేరావ్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్, గోపాల్, భోజన్న, విఠల్, సాయినాథ్, ఉపాధ్యాయుడు ధర్మాజీ, మాదవ్, మారుతి, భీంరావ్, గ్రామస్తులు పాల్గొన్నారు.