తాంసి, అక్టోబర్ 9 : తాంసి మండలంలోని పొన్నారిలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం పొలం పనులు చేస్తున్న రైతులకు కనిపించింది. దీంతో భయబ్రాంతులకు గురైన రైతులు, కూలీలు గ్రామ పెద్దలకు తెలియజేశారు. వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఎఫ్ఎస్వో ప్రేమ్ సింగ్ సంబంధిత అటవీశాఖ అధికారులు, సర్పంచ్ సంజీవ్‌రెడ్డితో కలిసి రైతు నగేశ్‌రెడ్డి పొలంలో చిరుత అడుగులను గుర్తించారు. అవి చిరుత అడుగులేనని, సంచారం వాస్తవమేనని అధికారులు నిర్ధారించారు. రైతులు ఆందోళన చెందవద్దని ఎఫ్ఎస్వో సూచించారు. చిరుత సంరక్షణకు చర్యలు చేపడుతామని తెలిపారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించామని వివరించారు.