కౌటాల, సెప్టెంబర్ 16 : తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడంపై అంబేద్కర్, సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు నేతకానీ సంఘం రాష్ట్ర కార్యదర్శి, ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్ పాలాభిషేకం చేశారు. గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నూతన పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సుధాకర్ రెడ్డి, తాటినగర్ సర్పంచ్ సోమయ్య, ఉపసర్పంచ్ తిరుపతి, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు రవీందర్ గౌడ్, సంతోష్, బాపు, వినాయక్ గౌడ్, నేతకాని సంఘం నాయకులు పత్రు, కిశోర్, జీవన్ దాస్, అశోక్, జానకీరావు, శంకర్, ప్రకాశ్, రామారావు తదితరులున్నారు.
ఆసిఫాబాద్, సెప్టెంబర్16 : జిల్లా కేంద్రంలోని హడ్కోకాలనీలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు టీఆర్ఎస్ నాయకులు అన్సార్, అహ్మద్ మల్లేశ్, మన్సూర్, భీంబాయి, ఈశ్వరి, సుజాత, గణేశ్, హరీశ్, పార్వతి, వెంకటేశ్, సురేశ్ తదితరులున్నారు.
జైనూర్, సెప్టెంబర్ 16: జైనూర్ మండల అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అన్నారావ్, నాయకులు సోన్కాంబ్లే బుతాలే కిరాణ్, జనార్దన్, కాంబ్లే అశోక్, గైక్వాడ్ సతీశ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
కోటపల్లి, సెప్టెంబర్, 16 : కోటపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంపీపీ మంత్రి సురేఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాగం రాజక్క, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు బైస ప్రభాకర్, రాళ్లబండి శ్రీనివాస్, పుప్పిరెడ్డి రాంరెడ్డి, సుందిళ్ల మొండి, వెంకటి, బెల్లంపల్లి మల్లయ్య, కొమిరెల్లి విజయ్, రాగం స్వామి పాల్గొన్నారు.