నేరడిగొండ, ఆగస్టు 19 : వడూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణుడు, గోపిక వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. ఉట్టికొట్టే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి, ఉపాధ్యాయులు గంగాధర్, రాకేశ్, ఎస్ఎంసీ చైర్మన్ సురేశ్, తదితరులు పాల్గొన్నారు.సిరికొండ, ఆగస్టు 19 : మండలంలోని సోంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కృష్ణుడు, గోపికల వేషధారణలతో హాజరైన విద్యార్థుల మధ్య కృష్ణాష్టమి వేడుకలను కోలాహలంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కిరణ్ కుమార్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, గంగాధర్, స్వప్న పాల్గొన్నారు.
బోథ్, ఆగస్టు 19: మండలంలోని ధన్నూర్ (బీ), బోథ్ (బాలికల), వేదం, నాగభూషణం పాఠశాలల్లో విద్యార్థులు కృష్ణుడు, సత్యభామ, గోపిక వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఉట్టికొట్టే కార్యక్రమం చేపట్టారు. అనంతరం కోలాటాలు ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమాల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
భీంపూర్, ఆగస్టు 19 : భీంపూర్. కరంజి(టీ), అంతర్గాం, గోముత్రి, గుబ్‌డి గ్రామాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గీతాచార్యుడిని పూజించి పూజారి పద్మయ్య ఉట్టికొట్టే కార్యక్రమం ప్రారంభించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బక్కి లలిత, స్వాతిక, ప్రతాప్, నిమ్మవేణుయాదవ్, లింబాజీ, నాయకులు నరేందర్‌యాదవ్, గుండా ప్రకాశ్‌యాదవ్, కిష్టయ్య, కపిల్యాదవ్, రాథోడ్ ఉత్తమ్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్, ఆగస్టు 19 : మండల కేంద్రంలో యువకులు ర్యాలీ తీశారు. అనంతరం ఉట్టి కొట్టారు. కార్యక్రమంలో యువకులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
నార్నూర్, ఆగస్టు 19 : మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ప్రాథమిక పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మిలింద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, ఆగస్టు 19 : మండలంలోని దేగామ, గిర్నూర్, పిప్పిరి, బజార్హత్నూర్, టెంబి, మంజారంతండా, భూతాయి గ్రామాల్లో గోకులాష్టామి వేడుకలు నిర్వహించారు. స్థానిక విఠలేశ్వర ఆలయంలో యాదవ సంఘం సభ్యులు పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, యువజన సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్, ఆగస్టు 19 : మండలంలోని గుంజాల గ్రామంలో భక్తులు గోవులకు నైవేద్యం తినిపించారు. కార్యక్రమంలో బాబ్రువన్ మహారాజ్, రాంషావ్ మహారాజ్, కుమ్ర లక్ష్మణ్పటేల్, సర్పంచ్ కుమ్ర సావిత్రీబాయి, భక్తులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 19 : జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌లో రామకృష్ణ సేవా సమితి, కౌన్సిలర్ సుజాత రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో రామకృష్ణ సేవాసమితి అధ్యక్షుడు కోరెడ్డి లెనిన్, సంయుక్త కార్యదర్శి సమ్మయ్య, కిషన్‌రెడ్డి, శ్రీకాంత్, ప్రశాంత్, శ్రీధర్, సాయి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తలమడుగు, ఆగస్టు 19: సుంకిడి గ్రామంలోని శ్రీకృష్ణ ఆలయంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గ్రామంలోని పలువీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్ యాదవ్, ఎంపీటీసీ గౌరమ్మ, ఆలయ కమిటీ అధ్యక్షుడు విలాస్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, ఆగస్టు19: మండల కేంద్రంలో సతీశ్ టైలర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉట్టి కార్యక్రమాన్ని సీఐ సైదారావు ప్రారంభించారు. మండలంలోని యువకులు బృందాలుగా పోటీపడి ఉట్టి కొట్టి బహుమతిని గెలుపొందారు.