దండేపల్లి, జూలై15: వర్షాలతో నష్టపోయిన బాధితులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు హామీ ఇచ్చారు. శుక్రవారం దండేపల్లి మండలంలోని గుడిరేవు, ద్వారక గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. గోదావరి తీర ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులను, ముంపునకు గురైన ఇండ్లలోని బాధితులను పరామర్శించారు.అధైర్యపడొద్దని ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని భరోసా కల్పించారు. పంట నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను త్వరగా సరి చేయాలని ట్రాన్స్‌కో ఎస్ఈని ఫోన్లో ఆదేశించారు. ఆయన వెంట నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగయ్య, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అనిల్, తహసీల్దార్ హన్మంతరావు, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
వేంపల్లిలో పర్యటన
హాజీపూర్, జూలై 15 : హాజీపూర్ మండలంలో వరద ముంపునకు గురైన వేంపల్లి గ్రామాన్ని శుక్రవారం ఎమ్మెల్యే దివాకర్ రావు, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు సందర్శించారు. బాధితుల ఇండ్లను, నష్టపోయిన సామగ్రిని పరిశీలించారు. ముంపు గ్రామాల్లో పారిశుధ్య పనులతో పాటు సహాయక చర్యలు ముమ్మరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వరదలతో జరిగిన జరిగిన నష్టాన్ని అధికారులతో అంచనా వేయించి ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ ఓలపు శారద-రమేశ్, ఎంపీడీవో అబ్దుల్ హై, ఎంపీవో శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, గ్రామ అధ్యక్షుడు రాంచందర్, వార్డు సభ్యులు దామోదర్, నాయకులు ఆరె శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.
విద్యుత్ స్తంభాలను సరి చేయాలి
లక్షెట్టిపేట, జూలై 15 : లక్షెట్టిపేట మున్సిపాలిటీలో వర్షాలకు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను వెంటనే సరి చేయాలని ఆ శాఖ అధికారులను మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు ఆదేశించారు. ఆరు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పట్టణంతో పాటు మోదెల గోదావరి నది పరిసరాల్లో ఉన్నటు వంటి విద్యుత్ స్తంభాలతో పాటు శ్మశాన వాటిక, వ్యవసాయ మోటార్లు దెబ్బతిన్నాయి. వాటిని పరిశీలించి, విద్యుత్ శాఖ ఏడీ, ఆర్అండ్ బీ ఏడీలతో ఫోన్లో మాట్లాడారు. సుమారుగా 150 విద్యుత్ స్తంభా లు, 25 మోటార్లు చెడిపోయాయని నాలుగు రోజుల్లో సరి చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు.
లక్షెట్టిపేట గోదావరి పుష్కర ఘాట్ వద్ద ఆర్అండ్బీ రోడ్డుకు మరమ్మతు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్‌ను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్‌గౌడ్, డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లిం గన్న, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, కౌన్సిలర్లు సురేశ్ నాయక్, చాతరాజు రా జన్న, మెట్టు కళ్యాణి రాజు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు గడ్డం వికాస్, జాగృతి జిల్లా నాయకుడు బానాల రమేశ్, గరిసె రవి, అన్వర్‌ఖాన్ తదితరులున్నారు.