జైనథ్, జూలై 13 : వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న హామీ ఇచ్చారు. జైనథ్, కూరలో వరద ప్రాంతాలను బుధవారం ఆయన పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్లు, పంటలు దెబ్బతిన్నాయని, బాధితులను ప్రభు త్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. వారికి పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశిం చారు. వరద బాధితులకు వంట సరుకులు, పులిహార ప్యాకెట్లు అందజేశారు. ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, పీఏసీఎస్ చైర్మన్ బాలురి గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్‌రెడ్డి, నాయకులు గడ్డం జగదీశ్‌రెడ్డి, గణేశ్‌యాదవ్, పీ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ దేవన్న పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం..
బేల, జూలై 13 : భారీ వర్షాల వల్ల నష్టపో యిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉం టుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రైతులకు భరోసా ఇచ్చారు. బుధవారం బేల మండలం సైద్పూర్, పలాయితండా, సాంగ్వి, తోయగూడ, మారుగూడ తదితర గ్రామాల్లో సాత్నాల ప్రాజెక్టు వరదతో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యాన్ని నింపారు. త్వరలోనే ఆధికారులు పర్య టించి పంట నష్టం వివరాలను సేకరిస్తారన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల వల్ల పంట నష్టం, కొన్నిచోట్ల పాత ఇండ్లు కూలిపోయాయని పేర్కొన్నారు. ఈ నేప థ్యంలో జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తున్నదని తెలిపారు. సాత్నాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల పంటలు నష్టపోయాయని, బాధిత రైతులకు నష్ట పరిహా రం అందేలా ప్రభుత్వానికి నివేదిక పంపిం చామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్యాం ప్రమోద్ రెడ్డి, ఆడ నేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్పవర్, తహసీల్దార్ బడాల రాంరెడ్డి, ఎంపీవో సమీర్ హైమద్, నాయకులు రాథోడ్ రోహిదాస్, కిష్టు, దత్తు, ఆయా శాఖల ఆధికారులు, గ్రామ సర్పంచ్ లు, నాయకులు తదితరులు ఉన్నారు.