కుభీర్, జూలై 9: వంట గ్యాస్ ధరల పెంపుపై నిరసనలు కొనసాగుతున్నాయి. మండలంలోని పార్డి(బీ) గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు యేరేకర్ మిలింద్ ఆధ్వర్యంలో శనివారం గ్రామంలోని యువకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు వంట గ్యాస్ ధరల పెంపుపై నిరసన చేపట్టారు. వర్షంలో గొడుగులు పట్టుకొని ‘సామాన్యులపై ధరల దాడి… సాలు మోదీ..’ అంటూ నినాదాలు చేశారు. పెంచిన ధరలు తగ్గించక పోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో అన్నేవార్ శంకర్, అన్నేవార్ మోహన్, వాఘ్మారే కిశోర్, కోత్మీరే సాయినాథ్, అన్నేవార్ సంజీవ్, మోతేరావు కపిల్, ఖండకే రవి, వాఘ్మారే ఉద్ధవ్, దేవుకే విఠల్, మార్పకోల్ల పాండురంగ్, అన్నేవార్ సురేశ్, ఎం.సురేశ్, కండ్కే సాయినాథ్, వాఘ్మారే ప్రకాశ్ పాల్గొన్నారు.