ఇంద్రవెల్లి, జూలై 9 : రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి భర్త కుమ్ర రాజు(57) అంత్యక్రియలు శనివారం మండలంలోని దోడంద గ్రామంలో జరిగాయి. ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాజు భౌతికకాయం వద్ద నివాళులర్పించి ఈశ్వరీబాయిని ఓదార్చారు.
ఎమ్మెల్యేలు జోగు రామన్న, రేఖానాయక్, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎంపీ గోడం నగేశ్, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, ఉట్నూర్ ఎంపీపీ పంద్రా జైవంత్రావ్, ఇంద్రవెల్లి ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, పీఏసీఎస్ చైర్మన్ మారుతీ పటేల్ డోంగ్రే, మాజీ ఎంపీపీ కనక తుకారాం, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అంజద్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు సుధాంలక్ష్మి, కొమ్ము ఉమా యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు వెడ్మ బోజ్జు, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు మరప రాజు, మండల ప్రజాప్రతినిధులు, ఆదివాసీ గిరిజన సంఘాలు, ఆయా పార్టీల నాయకులు పాల్గొని కుమ్ర రాజు పార్థివ దేహానికి నివాళులర్పించారు. మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.