ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్, జూలై 3: బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. పరిసరాలు, పచ్చని చెట్లు, ఆ చెట్లపై ఆటలాడుకునే వానరాలతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఒక పక్క నదీమతల్లి, గంగమ్మ, శక్తిత్రిమూర్తి స్వరూపిణి విగ్రహాలు, విడిది మందిరాలు, పిల్లలు ఆడుకునే మినీ ప్రకృతివనం చూపరులను కట్టిపడేస్తున్నది. ఈ జలపాతం సినిమా షూటింగ్లకు అనువుగా ఉన్నది.