
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 4 : ఉపా ధ్యాయ వృత్తికి వన్నెతెచ్చి, గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటిన మన దేశ రెండవ రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5న ఏటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పో గొట్టేది అని అర్థం.. అంటే మనలో అజ్ఞాన పొరలు తొల గించి, జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట.
కరోనా సమయంలోనూ…
కరోనా కాలంలో విద్యార్థులు చదువు నష్టపో కూడదనే సదుద్దేశంతో ఆన్లైన్ పాఠాలు బో ధించి విజయం సాధించారు పలువురు ఉపా ధ్యాయులు. ఆయా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యా యులు జూమ్ యాప్, గూగుల్ క్లాస్‌రూం, గూగుల్ మీట్ తదితర ఆన్లైన్ యాప్‌ల ద్వా రా పాఠాలు బోధించారు. మరి కొంత మంది ఉపాధ్యాయులు విద్యార్థుల సౌకర్యార్థం యూ ట్యూబ్‌లో పాఠాలు అందుబాటులో ఉంచారు.
విద్యార్థులు నష్టపోవద్దని..
కరోనా వైరస్ వల్ల విద్యావ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రభుత్వ విద్యార్థులు నష్టపోకూడదని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉండాలనే సదుద్దేశంతో రెండేళ్లుగా పిల్లలకు జూమ్‌లో బోధిస్తున్నాను. ఇవే పాఠాలను యూ ట్యూబ్‌లో అవర్ క్లాస్ రూం( Our Classroom ) పేరుతో అప్లోడ్ చేశా ను. ఐదేండ్లుగా లెర్న్ విత్ అమర్ (Learn with Amar) యూ ట్యూబ్ ఛానల్లో మా పిల్లలు అమర్ సాత్విక్, అనఘ్ విఘ్నేష్‌తో కలిసి వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా వివిధ పటాలను ఎలా గీయాలనే విషయంపై ట్రిక్స్‌ను అప్లోడ్ చేశాను.