ఎదులాపురం, మే 25 : విద్యుత్ వినియోగ దారులను ఇబ్బందులకు గురి చేయవద్దని, వారితో సత్ప్రవర్తనతో ఉండి సమస్యలు ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని రాష్ట్ర విద్యుత్ నియం త్రణ మండలి అధ్యక్షుడు శ్రీరంగారావు సూచిం చారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మంది రంలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ముఖాముఖి కార్యక్రమం బుధవా రం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విని యోగదారులు, విద్యుత్ ప్రమాదంలో నష్టపో యిన వారు, ప్రమాదాల్లో అంగవైకల్యం కలిగిన వారు, రైతులు, సర్పంచ్లు, వార్డు సభ్యులు వచ్చి వారి సమస్యలు వివరించారు. దీంతో శ్రీరంగా రావు అప్పటికప్పుడే సమస్యలను పరిష్కరించా రు.
ఏండ్ల తరుబడి పెండింగ్లో ఉన్న సమస్యలు ఎందుకు పరిష్కరించ లేదని సంబంధిత అధికా రులను ప్రశ్నించారు. పరిష్కరించే సమస్యలు ఏండ్ల తరబడి పెండింగ్లో ఉండడం విచారక మన్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలను వారం లో పరిష్కరించాలని అధికారులను అదేశించారు. వినియోగదారుడు ఏదైనా సమస్య పరిష్కరం కోసం ఫిర్యాదు ఇస్తే వాటిని అధికారులు స్వీకరిం చాలన్నారు. ఒకవేళ విద్యుత్ సమస్యలపై అధికా రులు ఎవరైనా ఫిర్యాదు తీసుకోకపోయినా, దురు సుగా ప్రవర్తించిన వెంటనే 040-23311127/ 28కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్ర మం రాత్రి వరకు కొనసాగింది. కార్యక్రమంలో టెక్ని కల్ సభ్యుడు మనోహర్ రాజు, ఫైనాన్స్ సభ్యుడు బండారు కృష్ణయ్య, ఎస్ఈ ఉత్తమ్ జాడే, విద్యుత్ శాఖ అధికారులు, రైతులు, విని యోగదారులు, తదితరులు ఉన్నారు.