తానూర్, ఏప్రిల్ 25 : దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని వడ్గావ్ గ్రామంలో హన్మాన్ ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి రూ.35 లక్షలు మంజూరవగా, సోమవారం గ్రామస్తులకు ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించామని చెప్పారు. ఇక్కడ గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం ఝరి(బీ) గ్రామంలో మహాలక్ష్మి, పోచమ్మ ఆలయాల్లో విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రత్యేక పూజ లు నిర్వహించారు. గ్రామస్తులు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కానుగంటి పోతారెడ్డి, హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయన్రావ్ పటేల్, మాజీ ఎంపీపీ బాషెట్టి రాజన్న, టీఆర్ఎస్ నాయకులు కాశీనాథ్, గోవింద్ పటేల్, విఠల్, రోహిదాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ముస్లింలకు ఇఫ్తార్ విందు..
పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి ముస్లింలకు ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ముస్లింలకు అండగా నిలిచేలా దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మురళీ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆసిఫ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.