తాంసి, ఏప్రిల్ 13 : పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని జడ్పీటీసీ రాజు అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంతో పాటు పొన్నారి , హస్నాపూర్ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు. సరుకులు, రిజిష్టర్లను, వంట తీరును పరిశీలించారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు మెనూ ప్రకారం భోజనం అందజేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో ఆకుల భూమయ్య, తహసీల్దార్ సంధ్యారాణి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్‌కుమార్, సర్పంచ్‌లు కృష్ణ, సంజీవ్‌రెడ్డి, ఎంపీటీసీలు రఘు, నరేశ్, నాయకులు పరమేశ్, కాంత్‌రెడ్డి, మహేశ్ ఉన్నారు.
పోషకాహార అవగాహన సదస్సు
బేల, ఏప్రిల్ 13 : మండల కేంద్రంలోని వైద్య ఆరోగ్య, మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషకాహార అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇంద్రశేఖర్ మాట్లాడుతూ వయసుకు తగిన ఎత్తు, బరువు లోపంతో ఉన్న పిల్లలకు, రక్తహీనతతో బాధ పడుతున్న గర్భిణులు, బాలింతలను గుర్తించి ప్రత్యేక చికిత్సతో పాటు బాలామృతాన్ని అందించాలని సూచించారు. 12 నుంచి 17 సంవత్సరాల ఏళ్ల లోపు పిల్లలకు ప్రతి గురువారం ఐరన్ మాత్రలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి సురేశ్ , ఏఎన్ఎంలు, పీహెచ్సీ సిబ్బంది, ఆశకార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
జైనథ్‌లో..
జైనథ్, ఏప్రిల్ 13 : మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలను ఎంపీపీ గోవర్ధన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బరువు తక్కువ, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలకు బలమైన ఆహారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీడీవో గజానన్‌రావు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్‌రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఎస్ లింగారెడ్డి, ఎంపీవో వెంకటరాజు, సర్పంచ్ దేవన్న పాల్గొన్నారు.
చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలి
తలమడుగు, ఏప్రిల్ 13: పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపీడీవో రమాకాంత్ సూచించారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల బరువును చూశారు. కార్యక్రమంలో ఎంపీవో దిలీప్, సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
సిరికొండలో..
సిరికొండ, ఏప్రిల్ 13 : మండల కేంద్రంలోని మొదటి అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీపీ పెందూర్ అమృత్ రావ్ తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలు ప్రతి నెలా అంగన్ వాడీ కేంద్రంలో బరువును చూసుకోవాలన్నారు. ఎక్కువ శాతం ఆకుకూరలు, పండ్లు, పాలు తీసుకోవాలని సూచించారు. ఎంపీపీ వెంట ఎంపీడీవో సురేశ్, అంగన్ వాడీ టీచర్ రాణి, వార్డు సభ్యులు రాజు ఉన్నారు.
పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలి
బోథ్, ఏప్రిల్ 13 : పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని సర్పంచ్ పంద్రం సుగుణ సూచించారు. మండలంలోని పట్నాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. పిల్లల బరువు చూస్తూ పౌష్టికాహారం అందిస్తున్నందున కేంద్రాలకు వచ్చేలా చూడాలన్నారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి మిథున్, అంగన్వాడీ టీచర్లు తొడసం సుశీల, యశోద ఉన్నారు.
నార్నూర్, ఏప్రిల్ 13 : మండలంలోని గంగాపూర్, తాడిహత్నూర్ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఎంపీడీవో రమేశ్ తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే గాదిగూడ మండలం డొంగర్‌గావ్ గ్రామ పంచాయతీ పరిధిలోని రెండు అంగన్వాడీ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శి నిఖిల్ పరిశీలించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు శేఖర్, రమేశ్, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.