దస్తురాబాద్,డిసెంబర్ 19 : మండలంలోని అన్ని గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమైయ్యాయి. ఈ ఏడాది వానకాలంలో సాగు చేసిన వరి చేతికి రావడంతో రైతులు పంట కోతలు మొదలు పెట్టారు. ప్రస్తుతం గ్రామాల్లో వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కోతలు గంటల్లోనే పూర్తి అవుతున్నాయి.రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. పంట కోసే సమయంలో రైతులు, యాజమానులు అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. యంత్రాల ద్వారా పని సులువుగా పూర్తవుతున్నాయి.పనులు చేసే సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి. పంట కోసే సమయంలో పొలాల్లో విద్యుత్ లైన్లు ఉంటాయి. హార్వెస్టర్లకు ఆ విద్యుత్ తీగలు తగిలి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ట్రాక్టర్లలో ధాన్యం తీసుకెళ్లే సమయలో, గడ్డి కట్టలు తరలించేటప్పడు విద్యుత్ తీగలు తగిలే అవకాశం ఉంది. అజాగ్రత్తగా ఉంటే వాహనాలతో పాటు ప్రాణాలకు ప్రమాదం తప్పదని అధికారులు సూచిస్తున్నారు.
యాజమానులు, డ్రైవర్లు జర భద్రం
యాజమానులు హార్వెస్టర్ నడిపే డ్రైవర్, సహయకుడిపై మొత్తం భారం వేసి ఉండవద్దు.
కోతకు పొలంలోకి వెళ్లేటప్పుడు ఇరువైపులా దారి సక్రమంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి.
పొలాల్లో చేతికందే ఎత్తులో చాలా చోట్ల విద్యుత్ తీగలు ఉంటాయి. ముందుగానే గమనించి జాగ్రత్తలు పాటించాలి.
విద్యుత్ స్తంభాలకు దూరం నుంచి హార్వెస్టర్‌ను నడపాలి.
పొలంలో విద్యుత్ తీగలు ఉంటే ముందుగా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి కోత పూర్తయ్యే వరకు సరఫరా నిలిపి వేయించాలి.
రైతులు జాగ్రత్తలు పాటించాలి…
ప్రమాదాలు జరగకుండా వరి కోత మిషన్కి దాదాపు మీటరు దూరంగా ఉండి ఆ వరి దుబ్బులను ఆ మిషన్‌లో వేయాలి.
వరి కోత మిషన్ నడుస్తున్నప్పుడు దూరంగా ఉండాలి. దాని నుంచి వచ్చే గడ్డి వేగంతో వస్తుంది. వరి కోత మిషన్ ఎత్తులో ఉండడం ద్వారా దాని చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు చూడడం కష్టంగా ఉంటుంది. హార్వెస్టర్ నడిచే పరిసర ప్రాంతాలకు దూరంగా ఉండడం ఉత్తమం. ప్రమాదాలకు గురి కాకుండా ఉంటుంది.
రైతులు అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుత కాలంలో కూలీల కొరతతో రైతులు యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.రైతులకు కొన్ని గంటల్లోని ధాన్యం చేతికి వస్తుంది.యంత్రాలతో ఎంత సమయం ఆదా అవుతుందో,ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రమాదాలకు చోటు ఇచ్చిన వాళ్ళు అవుతారు.కొన్ని చొట్ల భూమి తడిగా ఉండడంతో పొలం కోసే సమయంలో వరి కోత యంత్రాలు దిగబడే అవకాశం ఉంటుంది.కాబాటి చేతులతో కూలీల సహయంలో ఆ వరి పంటను కోపి కుప్పగా వేస్తారు.చేతులతో వరి పంట దుబ్బులు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి అందులో వేయాలి.లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.రైతులు అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.
–జాడి తిరుపతి, ఏఈవో, దస్తురాబాద్ క్లస్టర్
విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలి
వరి కోతలు ప్రారంభం అయినవి కాబట్టి వరి కోత యంత్రాల యాజమానులు విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి.వరి పంట పోలలలో విద్యుత్ తీగలు ఉంటాయి కాబట్టి, వరి కోత యంత్రాలు ఎత్తుగా ఉండడంతో వరి కోసే సమయంలో విద్యుత్ తీగలు తగిలే అవకాశం ఉంది,దీంతో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.అలాగే ట్రాక్టర్లో వరి ధాన్యం తీసుకవెళ్ళెటుప్పుడు,వరి గడ్డి కట్టలు తీసువెళ్ళెటప్పుడు విద్యుత్ తీగలు తగిలే అవకాశం ఉంది.పంట పోలలలో పని చేస్తున్నప్పుడు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.ఏలాంటి అనుమానలు ఉన్నా విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందిస్తే వెంటానే విద్యుత్ సరాఫరను నిలిపివేస్తాం.ప్రమాదాలు సంభావించకుండా ఉంటుంది.
–కెశెట్టి శ్రీనివాస్, ఏఈ, దస్తురాబాద్