బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయడంతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-ఫామ్‌లు అందించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు జోరుగా సంబురాలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నాయకులు పటాకులు కా ల్చి.. మిఠాయిలు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ ని యోజకవర్గ యువ నాయకుడు నడిపెల్లి విజిత్రా వు, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజ య్య, పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం పాల్గొన్నా రు. తాండూర్ ఐబీలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజ లు పెద్ద ఎత్తున పటాకులు కాల్చి.. జై తెలంగాణ.. జైజై కేసీఆర్.. నినాదాలతో హోరెత్తించా రు. చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో నాయకులు, కార్యకర్తలు పటాకు లు కాల్చి..మిఠాయిలు పంపిణీ చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి ఇంటి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా పాల్గొన్నారు. సిర్పూర్(టీ)లో కార్యకర్తలు పటాకులు పేల్చి.. మిఠాయి లు పంపిణీ చేశారు.
కాగజ్‌నగర్ పట్టణంలోని గాంధీ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జో గు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీతో పాటు పార్టీ నాయకులు నృత్యాలు చేశారు. బోథ్ బస్టాండ్, జైనథ్ మం డలం భోరజ్‌లో పటాకులు కాల్చి.. నినాదాలతో హోరెత్తించారు. ఇచ్చోడ, సిరికొండ, నార్నూర్ మండల కేంద్రంలోని గాం ధీ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేశారు. నిర్మల్ జిల్లా పట్టణంలోని మంత్రి క్యాం పు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథానికి పూజలు చేశారు. పటాకులు కాల్చి.. క్యాంపు కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ తీశారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో 100 సీట్లు గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ యువనాయకుడు అల్లోల గౌతం రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్ పాల్గొన్నారు. భైంసాలో పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయం ముందు పటాకులు కాల్చారు. ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంపిణీ చేశారు.