నార్నూర్, జూన్ 17 : పచ్చదనం, పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యమివ్వాలని అధికారులు, పంచాయతీ సిబ్బందికి ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గాదిగూడ మండలంలోని రుప్పాపూర్, మేడిగూడ గ్రామాల్లో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. పల్లెప్రగతి ప నుల వివరాలు తెలుసుకున్నారు. వీధుల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల నిర్వహణ, అవెన్యూ ప్లాంటేషన్, తడి, పొడి చెత్త సేకరణ, సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలించారు.
పల్లెప్రగతి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మన ఊరు-మన బడిలో భాగంగా చేపడుతున్న మరమ్మతు పనులను ప ర్యవేక్షించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధు లు భాగస్వామ్యంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. హరితహారానికి మొక్క లు సిద్ధంగా ఉండాలని, ప్రణాళికాబద్ధంగా నా టాలన్నారు.
మన ఊరు-మన బడి పనుల్లో నా ణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని ఆరికట్టేలా అవగాహన క ల్పించాలన్నారు. వైస్ ఎంపీపీ మర్సివనే యో గేశ్, ఎంపీడీవో రామేశ్వర్, తహసీల్దార్ ఆర్కా మోతీరాం, ఎంపీవో షేక్ ఖలీమ్హైమద్, ఐటీడీ ఏ డీఈ శివప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివా స్, ఏఈ రాథోడ్ సునీల్, ఏపీవో పవార్ నితిన్, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.