పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ ట్యాంక్ బస్తీ వద్ద గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ భారతీ హోళికేరితో కలిసి పాల్గొన్నారు. ప్రజలంతా కాలుష్య రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. అంతకుముందు రూ.25 లక్షలతో చేపట్టిన కల్వర్టు పనులను ప్రారంభించారు.
బెల్లంపల్లి టౌన్, జూన్ 16 : పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. పట్టణంలోని బూడిదగడ్డ ట్యాంక్ బస్తీ వద్ద గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ భారతీ హోళికేరితో కలిసి ఆయన మాట్లాడారు. అంతకుముందు రూ.25 లక్షలతో చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు.
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ప్రణాళిక బద్ధంగా చదివితే సులువుగా విజయం సాధించవచ్చని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలసి కలెక్టర్ గురువారం స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
ఉచిత శిక్షణ తరగతులను సద్విని యోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధిం చాల ని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, ఆర్డీవో శ్యామలాదేవి, తహసీల్దార్ కుమార స్వామి, కౌన్సిలర్లు గెల్లి రాజలింగు, రాజనాల కమల, గోసిక రమేశ్, భూక్యా రామూ నాయక్, కొక్కెర చంద్రశేఖర్, నెల్లి శ్రీలత, తుంగపల్లి సుజా త, నాయకులు రాజనాల రమేశ్, నెల్లి రమేశ్, తుంగపల్లి గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.