వచ్చే వానకాలంలో ఏయే పంటకు ఏ మేరకు రుణాలు ఇవ్వాలనే అంశాలపై స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) ఓ నిర్ణయానికి వచ్చింది. రకాన్ని బట్టి ఎకరాకు గతేడాదికంటే అదనంగా రూ. 2వేల నుంచి రూ. 4 వేల వరకు పెంచుతూ రుణ ప్రణాళిక(స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)ను ఖరారు చేసింది. ఈ మేరకు జూన్ మొదటి వారంలో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేయనుండగా, రైతులకు ప్రయోజనం చేకూరనున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : వచ్చే వానకాలంలో పంట రుణాలు ఇవ్వాలనే అంశాలపై స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) ఓ నిర్ణయానికి వచ్చింది. పంట రకాన్ని బట్టి ఎకరాకు గతేడాదికంటే అదనంగా రూ. 2వేల నుంచి రూ. 4 వేల వరకు పెంచుతూ రుణ ప్రణాళిక (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)ను ఖరారు చేసింది. ఇందులో భాగంగా 2022-23వ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి, దాని అనుబంధ రంగాలకు ఏ మేరకు రుణాలు అందించాలనే అంశంపై త్వరలో స్పష్టత రానున్నది. ఏటా రైతులకు ఇచ్చే టర్మ్ రుణాలు, పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలను ఆర్థిక ప్రణాళికలో పొందుపరుచనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎస్ఎల్బీసీ ఖరారు చేసిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం జిల్లా లీడ్ బ్యాంక్ రైతులకు అందించాల్సిన పంటరుణాలపై బ్యాంకుల వారీగా టార్గెట్లను నిర్ణయించనున్నది. ఈ మేరకు జూన్ మొదటి వారంలో లీడ్ బ్యాంకు జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేయనుంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,19, 165 మంది రైతులు ఉన్నారు. వీరిలో 5 నుంచి 10 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు సుమారు 80 వేల మంది ఉ న్నారు. మిగతా రైతులు 10 ఎకరాలు.. అంతకంటే ఎక్కువ భూములు కలిగి ఉన్నారు. వీరి లో చాలా మంది బ్యాంకుల నుంచి పంట రు ణాలు పొందుతున్నారు.
ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,51,778 ఎకరాల్లో పంటలు సా గు చేస్తున్నారు. ఇందులో వరి 33,534 ఎకరా లు, కంది 44,722 ఎకరాలు, సోయా 526 ఎ కరాలు, వేరు శనగ 51 ఎకరాలు, పొద్దుతిరుగు డు 170 ఎకరాలు, ఆముదం 200 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. మిగతా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా సన్న, చిన్నకారు రైతులే ఉండడంతో వీరు బ్యాంకులు అందించే రుణాలపై ఆధారపడి ఉం టారు. సర్కారు ఈసారి పంటరుణాలు పెంచడంతో రైతులకు మేలు జరుగనున్నది.
