కుభీర్, మే 18 : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో అడవుల శాతం పెరిగిందని కేంద్ర బృందం సభ్యుడు ప్రొఫెసర్ వెంకట రవి అన్నా రు. ఉపాధి పనుల పరిశీలనలో భాగంగా రాంనాయక్ తండాలో బుధవారం పర్యటించారు. అనంతరం అక్కడి ఏహెచ్‌ఎస్‌లో స్థానిక సర్పంచ్ రాథో డ్ శంకర్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేటా మొక్కలు నాటి సంరక్షించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, నాయకులు సంజయ్ చౌహాన్, అధికారులు ఉన్నారు.
మండలకేంద్రంతో మండలంలోని పార్డీ(బీ), రాంనాయక్ తండా, రంజని గ్రామాల్లో కేంద్రం బృందం బుధువారం పర్యటించింది. ఈజీఎస్ ని ధులతో చేపట్టిన పనులను పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యుడు ప్రొఫెసర్ వెంకటరవికి పార్డి(బీ)లోని పీపీవీ వద్ద సర్పంచ్ తూం పుష్పలత పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం వారు ఉపాధి నిధులతో చేపట్టిన పీపీవీలు, సెగ్రిగేషన్ షెడ్లు, హరితహారం నర్సరీలు, రైతు వేదికలు, వైకుంఠధామాలు, గ్రామాల్లో వేసిన సీసీ రోడ్లు, వాటిలో పెంచుతున్న మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
రంజనీలో ఇంకు డు గుంతలు, కాంటూరు కందకాలు, చేపల కందకాలు, రాళ్ల కట్టల పనులు చేపట్టడంపై వారు అభినందించారు. పీఆర్డీఈ సురేశ్, డీఆర్డీవో సీసీ గంగాప్రసాద్, ఎంపీపీ తూం లక్ష్మి, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, ఇన్చార్జి ఏపీవో రాథోడ్ హరిలాల్, ఎంపీవో సాయి ప్రసాద్, ఆయా గ్రా మాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు కమల్‌సింగ్ ఉన్నారు.