నేరడిగొండ, డిసెంబర్ 30 : అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని నేరడిగొండ అయ్యప్ప సేవా సమితి సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని సర్వీస్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్ కార్యాలయానికి చేరుకొని డిప్యూటీ తహసీల్దార్ జగదీశ్వరికి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో గురుస్వాములు ప్రవీణ్, మహేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, శంకర్, శోభన్‌రెడ్డి, మండలంలోని తేజాపూర్, నేరడిగొండ, వడూర్ గ్రామాల అయ్యప్ప స్వాములు పాల్గొనగా వీహెచ్‌పీ, బజ్రంగ్దళ్ కార్యకర్తలు మద్దతు తెలిపారు.
గుడిహత్నూర్, డిసెంబర్ 30 : హిందూ దేవతలను కించపరిచిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం తహసీల్, పోలీస్ స్టేషన్లో మెమోరండం ఇచ్చారు. కార్యక్రమంలో సమితి సభ్యులు రవీందర్, సుదర్శన్, ఆర్కే స్వామి, సందీప్, సతీశ్, శ్రీనివాస్, కుమార్, ప్రశాంత్ పాల్గొన్నారు.
ఇచ్చోడ, డిసెంబర్ 30 : మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు ఆందోళన చేపట్టారు. హిందూ దేవతలతో పాటు అయ్యప్ప స్వామిని అవమానించేలా మాట్లాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉదయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే సిరికొండ పోలీస్ స్టేషన్లో గురుస్వామి మల్లేశ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పురుషోత్తం రెడ్డి, దయాకర్ రెడ్డి, దత్తు, రాజేశ్వర్, సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.
బోథ్, డిసెంబర్ 30 : మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద అయ్యప్ప స్వాములు ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి ఫిర్యాదు చేశారు.
ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 30: హిందూ దేవుళ్లను కించపర్చిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప సేవా సంఘం స్వాములు శుక్రవారం స్థానిక ఎస్ఐ భరత్ సుమన్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సభ్యులు గోపాల్‌సింగ్, భూపతి, స్వాములు శ్రీనివాస్, రవి, తిరుపతి రెడ్డి, నారాయణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.