నార్నూర్ : పంచాయతీ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పనిచేసే నాయకుడికే ఓటు( Vote ) వేసి గెలిపించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు రాయల్ ఖాన్ ( Royal Khan) అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నేటితరం యువత తమ అమూల్యమైన ఓటును వజ్రాయుధంలా వినియోగిస్తూ పని చేసే నాయకుడికి వేసి గెలిపించాలని కోరారు.
ప్రజా నాయకుడిని ఎన్నుకోవడంలో యువత పాత్ర కీలకమన్నారు. మద్యం, డబ్బు వంటి ప్రలోభాలకు లొంగవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఆడే చేతన్, షేక్ మసూద్, రాథోడ్ కార్తీక్, షేక్ మజార్, చంటి జాదవ్, సయ్యద్ కరీం, బానొత్ ధోని, రాథోడ్ అర్జున్, సిరాజ్ ఖురేషి, సయ్యద్ రిహాన్ తదితరులున్నారు.